15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్ పార్టీ విజయానికి యూత్ వ్యూహాలు

16-10-2025 08:25 PM

యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

కాటారం (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి యూత్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పని చేయాలని మంథని శాసనసభ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీమల సందీప్ అన్నారు. గురువారం మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు, ఈ సమావేశంలో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన చర్యలపై కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి యువతను పార్టీతో కలిపి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.

పార్టీ సిద్ధాంతాలు, నాయకుల త్యాగాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేయడం యూత్ కాంగ్రెస్ ముఖ్య బాధ్యతగా నిర్ణయించారు, అదేవిధంగా మంథని నియోజకవర్గం లో మంత్రి శ్రీధర్ బాబు , శ్రీను బాబు లు అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి, ఆ పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు, పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సేవను తమ ధ్యేయంగా చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ రోజు వరకు ఉన్న యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను రద్దు చేయడం జరిగిందని ప్రకటించారు. రేపటి నుండి నూతన కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిషోర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్, యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, గడ్డం క్రాంతి, రెబల్ రాజ్ కుమార్, మోత్కూరి అవినాష్, సాధుల శ్రీకాంత్, బక్కతట్ల వినీత్, జాటోత్ వంశీ నాయక్, పర్శవెని నగేష్ యాదవ్, మంథని పట్టణ అధ్యక్షుడు పెంటరీ రాజు పాల్గొన్నారు.