18 April, 2026 | 11:49 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రాహుల్ గాంధీ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి

19-06-2025 04:50 PM

ఎమ్మెల్యే మురళి నాయక్ పిలుపు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని, రాహుల్ గాంధీ భారత దేశాన్ని ప్రపంచంలో కీర్తించబడే విధంగా ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్యంతో భారత్ జోడో యాత్ర నిర్వహించి ప్రజలను సంఘటితం చేసిన గొప్ప నాయకుడని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు.