18 April, 2026 | 10:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఘనంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2025 04:52 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ(Congress Party leader Rahul Gandhi) జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి రాహుల్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ సేవలను కొనియాడారు. ఆయురారోగ్యాలతో కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు అమూల్యమైన సేవలను అందించాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు ఎం ఏ నయీమ్, రాష్ట్ర మహిళా నాయకురాలు రొడ్డ శారద, మాజీ కౌన్సిలర్ గేల్లీ రాజలింగు, మైనార్టీ నాయకులు నిజాం, ఎస్సీ సెల్ నాయకులు రేగుల రాజలింగు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ సన్నీ బాబు, వైస్ ప్రెసిడెంట్ పోచంపల్లి హరీష్,  పట్టణ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు భూపెల్లి రాజేశ్వర్, మాజీ కౌన్సిలర్ కటకం సతీష్, చింతపండు శీను, కొమ్ము సురేష్, సీనియర్ నాయకులు మత్తమారి శ్రీనివాస్, నాయకులు నెల్లి రమేష్, పిల్లి ఆనంద్, జంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.