సౌందరరాజన్ అంత్యక్రియలు పూర్తి
మొయినాబాద్ ఫిబ్రవరి 28(విజయక్రాంతి): చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు దేవాలయ అభివృద్ధి చేసిన ప్రముఖ వ్యక్తి సౌందర్య రాజన్ అంత్యక్రియలు వేలాది మంది నాయకులు భక్తుల మధ్య అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకు లు ప్రొఫెసర్ సౌందర్యరాజన్ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు శనివారం మంత్రోచ్ఛారణాల మధ్య నిర్వహించారు.
ప్రముఖులు మాజీ హోం మం త్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డితోపాటు జంట నగరాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి అభిమానులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణం ప్రజలతో కిక్కిరిసిపోయిం ది. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అన్ని ఏర్పాట్లు నిర్వహిం చడంతో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్యరాజ్యం అంత్యక్రియలు సజావుగా ముగిశాయి.




