17 April, 2026 | 2:11 AM

సర్దార్ సర్వాయి పాపన్న సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

03-04-2025 12:00 AM

సూర్యాపేట, ఏప్రిల్ 02 (విజయక్రాంతి): సమాజంలోని అన్యాయాలపై ధైర్యసాహసాలతో వీరోచితంగా పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదన పు కలెక్టర్ రాంబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.ప్రతి ఒక్కరూ 10 మందికి సహాయం చేసి సమాజంలో పేదరిక నిర్మూలనకు పాటుపడాలని సూచించారు.నేటి యువత సర్దార్ సర్వాయి పాప న్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.  డీఆర్డిఓ పీడీ అప్పారావు,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, లత, జగదీశ్వర్ రెడ్డి, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిర్మించాలి

తుంగతుర్తి, ఏప్రిల్ 2 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించిన జిల్లా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని మండల గౌడ సంఘం అధ్యక్షులు తునికి సాయిలు గౌడ్, గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని 365 జాతీయ దారి పక్కన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చి మాట్లాడారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ట్యాంక్ బండి పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు తునికి సాయిలు గౌడ్, గౌడ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పులుసు వెంకటనారాయణ  గుండగాని అంజయ్య గడ్డం ఉప్పలయ్య  పులిపంపుల సైదులు, తొట్ల సుధాకర్, కొల్లు చిన్ని  పొదిల శ్రీరాములు  కునియాత్ నవీన్ కుమార్, గుండ్ల సత్యనారాయణ  చిర్ర నరేష్  తునికి శ్రీనివాస్, పాలకుర్తి వీరయ్య, తాడూరి సైదులు  గోపగాని వెంకన్న, పొడేటి రావణ్  తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 2 ( విజయ క్రాంతి): బడుగు బలహీనవర్గాల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట  స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్  ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న  గౌడ్ అని అన్నారు. సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత,  వివక్షకు వ్యతిరేకంగా పోరాటం   మహాయోధుడని అన్నారు.  బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, ఎస్సీ షెడ్యూల్ కులాల అభివృద్ధి  అధికారి వసంత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, కుల సంఘ నాయకులు, వివిధ శాఖల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

నాగారంలో..

  నాగారం ఏప్రిల్ 02: నాగారం మండల అధ్యక్షుడు చిత్తలూరు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి కార్యక్రమం  నాగారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు అనం తరం చిత్రపటానికి పలువురు నివాళులు అర్పించడం  జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిస్తాం పాపన్న గారి అడుగుజాడల్లో గౌడ హక్కుల కోసం సబ్బండ కులాల కోసం పోరాడుతామని అని అన్నారు.  సంస్కృతిక రాష్ట్ర అధ్యక్షులు గిలకత్తుల రమేష్ గౌడ్. పులుసు వెంకన్న వడ్లకొండ వెంకన్న   సైదులు  మల్లయ్య యాక స్వామి  సత్యనారాయణ. చిత్తలూరి సన్నీ . తదితరులు పాల్గొన్నారు

హుజూర్‌నగర్‌లో..

హుజూర్ నగర్, ఏప్రిల్ 2: జై గౌడ ఉద్యమ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు కేశగాని నాగేశ్వరరావు గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకట్ నగర్, మల్లన్న నగర్ లో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315 వ వర్ధంతి సందర్భంగా స్కూల్లో పిల్లలకి,స్టాఫ్ కీ పండ్లు,బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం జై గౌడ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో  జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్ రెడ్డి సార్, స్కూల్ టీచర్స్ తండు ఉపేందర్ గౌడ్, తండు హరికృష్ణ గౌడ్, కారంగుల చుక్కయ్య గౌడ్ , తండు రమేష్ గౌడ్, తండు శ్రీనివాస్ గౌడ్, కేశగాని వీరయ్య గౌడ్, వల్లపుదాసు సైదులు గౌడ్, కారంగుల కాశీవిశ్వనాథ్ గౌడ్ , కారంగుల రవికుమార్ గౌడ్, కేశగాని  విక్రాంత్ సాయి గౌడ్ పాల్గొన్నారు.