కందుకూరులో గులాబీ గూటికి 30 మంది యువకులు
కందుకూరు, మార్చి 22 (విజయక్రాంతి):మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతమైంది. కొత్తగూడ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువకులు ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. కేసీ ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎమ్మె ల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సేవలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు యువ కులు తెలిపారు.
ఈ సందర్భంగా జయేందర్ మాట్లాడుతూ, ఇతర పార్టీల్లో గుర్తింపు లేని వారికి బీఆర్‌ఎస్ లో సముచిత గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు. కొత్తగా చేరిన వారిని త్వరలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పరిచయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మీనరసింహారెడ్డి, సురసాని సురేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




