అమ్మవారి దయతో అందరూ క్షేమంగా ఉండాలి
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్ మార్చి 21 (విజయక్రాంతి):- సనత్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ కైలాష్ నగర్ ప్రెసిడెంట్ బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు భోగి బాలరాజ్ ఆధ్వర్యంలో 60 కార్లతో 30 ద్విచక్ర వాహనాలతో సుమారు 300 మందితో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వగృహానికి వెళ్లారు ఆయనను మర్యాదపూర్వకం గా కలిశారు ఎమ్మెల్యే తలసానికి భోగి బాలరాజ్ ఆయన కుటుంబ సభ్యులతో కాలనీ వాసులతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి గజమాలతో ఆయనను సన్మానించారు ఆయనకు స్వీట్స్ తినిపించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఎల్లవేళలా చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ జనరల్ సెక్రెటరీ పుట్టల శేఖర్, ఎస్పీ చక్రవర్తి సాదక్ అలీ ఓం ప్రకాష్ శర్మ ఒమర్, బెగ్ సాహెబ్, భోగి ప్రియవర్ధన్ , భోగి పృథ్వీరాజ్, పులి సాయి, మంగేష్, పుట్టల మోహన్, కైలాస్ నగర్, సుభాష్ నగర్, జయప్రకాష్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




