నరేశ్‌కు స్టార్ ట్యాగ్ ఇవ్వాలని ఫ్యాన్‌గా కోరుతున్నా
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త మీనన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
దర్శకులు మారుతి, త్రినాథ్‌రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, బలగం వేణు, యదు వంశీ, కార్తీక్ వర్మ దండు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ‘అందరం చాలా సిన్సియర్‌గా చేశాం. ఫలితం ఆడియన్స్ చేతిలో ఉంది’ అన్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ.. ‘నేను తొలిసారి కలిసిన హీరో అల్లరి నరేశ్. ఈ వేడుకలో ఆయన పక్కన కూర్చోవడం సంతోషంగా ఉంది.
నరేశ్ అన్న చేసిన రోల్స్ చాలా గొప్పవి.. ఆయనకు ఇష్టమోలేదో తెలియదుగానీ స్టార్ ట్యాగ్ ఇవ్వాలని ఓ ఫ్యాన్‌గా కోరుకుం టున్నా’ అన్నారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ప్రతి కంటెంట్ చాలా ప్రామిస్‌గా ఉంది’ అన్నారు. డైరెక్టర్ సుబ్బు మాట్లాడుతూ.. ‘సినిమాను ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం దర్శకులకు అదృష్టం’ అన్నారు. హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. ‘నరేశ్ గారితో వర్క్ చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ.. ‘బచ్చలమల్లి నేను చాలా ప్రేమించి చేసిన కథ’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.






