1 July, 2026 | 9:06 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఘోర రోడ్డు ప్రమాదంపై జగన్ సంతాపం

30-06-2025 02:08 PM

తాడేపల్లి: అన్నమయ్య జిల్లా(Annamayya District) కురబలకోట మండలం దొమ్మన బావి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ, టెంపో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులను కర్ణాటకలోని బాగేపల్లి వాసులుగా గుర్తించారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనను తీవ్ర దురదృష్టకరమని అభివర్ణించిన జగన్, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేశారు.