1 July, 2026 | 10:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు విషాదకరం

30-06-2025 02:27 PM

హైదరాబాద్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు విషాదకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తోన్న వార్తలు కలచి వేశాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని కవిత కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కవిత ఎక్స్ లో పోస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు ప్రమాదం సంభవించింది.

పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌  పరిశ్రమలో రియాక్టర్‌(Telangana Chemical Factory Blast) పేలింది.  ఈ ప్రమాదంలో ఎనిమింది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. పాశమైలారం రియాక్టర్‌  పేలిన ప్రమాద స్థలంలో ఇంకొక బ్లాక్‌ ఓపెన్‌ చేయాల్సి ఉందని మల్టీజోన్‌ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నామన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదసమయంలో కంపెనీలో 150మంది ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 90 మంది ఉన్నారని మల్టీజోన్‌ ఐజీ స్పష్టం చేశారు.