27 March, 2026 | 2:47 PM

Breaking News

భార్యను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు   •   గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్   •   భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ   •   నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •  

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్‌లో యుద్ధభేరి మహాసభ

01-12-2025 01:01 AM

వరంగల్ నుండి తరలి వెళ్లిన బీసీ జేఏసీ నాయకులు 

హనుమకొండ,నవంబర్ 30 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధనకై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభకు బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బీసీలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.ఈ సందర్భంగా హన్మకొండ నక్కలగుట్ట, హరిత హోటల్ నుండి తరలి వెళుతున్న వాహనాలకు బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు 17 శాతం మాత్రమే వచ్చాయని, గతంలో ఉన్న రిజర్వేషన్లలో 23 శాతం నుంచి 17 శాతం కుదించి, ఐదు శాతం రిజర్వేషన్లను తగ్గించారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. జనరల్ స్థానాలలో బీసీలకు అన్ని పార్టీలు అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లను కల్పించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మాట తప్పితే అన్ని పార్టీలపై తిరుగుబావుట ఎగురవేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం 9 ప్రకారం గతంలో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు సర్పంచ్ స్థానాలను బీసీలకు కేటాయించాలని వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, దొడ్డిపల్లి రఘుపతి, తమ్మేలా శోభరాణి, మాదం పద్మజా దేవి, భీమగాని యాదగిరి గౌడ్, మడిశెట్టి నాగరాజు, తేళ్ల కిషోర్, సుగుణ, గొట్టే మహేందర్, చాగంటి రమేష్, ఇందిర పాల్గొన్నారు.