ఎల్ఓసి అందజేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే
జహీరాబాద్ ఆగస్టు 22(విజయ క్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు రూ.15లక్షల రూపాయల ఎల్ఓసిని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాలికరావు అందజేశారు. శనివారం నాడు కవేలి కోహిర్ మండలము కవేలి గ్రామానికి రావుకు రూ.5,00,000, జహీరాబాద్ మండలము పస్తాపూర్ గ్రామానికి చెందిన మొగులయ్య కుమారుడు అనిల్ కు ఐదు లక్షలు, జరా సంఘం మండలము గుంత మర్పల్లి గ్రామానికి చెందిన రాజు గౌడ్ కు రూ. 5,00,000 ఎల్ఓసి అందజేశారు. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నందున వారి హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం ఐదు లక్షల రూపాయలు చొప్పున ముగ్గురికి అందించడం జరిగిందని వారు ఆయురారోగ్యాలతో తిరిగి తన కుటుంబంలో జీవనం గడపాలని ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. ఎల్వోసీలు అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే మాణిక్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు






