4 April, 2026 | 1:51 PM

Breaking News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •   పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు   •  

పాక్‌కు జింబాబ్వే షాక్

25-11-2024 12:29 AM

 డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం

బులావాయో: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్ ఆ చేదు అనుభవాన్ని మరిచిపోకముందే జింబాబ్వే షాకిచ్చింది. సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో జింబాబ్వే పాకిస్థాన్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. నరావా (48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆల్‌రౌండర్ సికందర్ రజా (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 125కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జింబాబ్వేను రజా, నరావా ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.

అనంతరం బరిలోకి దిగిన పాకిస్థాన్ 21 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాచ్‌కు అడ్డు తగిలిన వరుణుడు ఎంతకీ తెరిపినివ్వలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జింబాబ్వే విజయం సాధించినట్లు అంపైర్లు పేర్కొన్నారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది.