మోకాళ్ళపై ఉద్యోగుల నిరసన

18-10-2026 | 04:13pm

నిర్మల్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) NHM జేఏసీ 6వ రోజు మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్మల్ జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా NHM JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

“మోకాళ్లపై మా నిరసన – న్యాయం జరిగే వరకు మా పోరాటం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం అమలు, ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ అధ్యక్షులు గంగాధర్, జిల్లా కోఆర్డినేటర్ రమణ, నాయకులు dr. రాజశేఖర్, dr నాగరాజ్, dr. సన్నిత్, dr. రమేష్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు