నిర్మల్ బస్టాండ్లో వ్యక్తి అదృశ్యం
20-11-2026 | 04:14pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని బస్టాండ్ లో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ సీఐ సమ్మయ్య శుక్రవారం తెలిపారు. దిలావర్పూర్ మండల(Dilawarpur Mandal) కేంద్రానికి చెందిన శివరాత్రి రవి అనే వ్యక్తి ఈ నెల 16న నిర్మల్ కు వచ్చి బస్టాండ్ నుంచి కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ 8712659511, పోలీస్ స్టేషన్ 8712659512 మొబైల్ నంబర్ లకు సమాచారం ఇవ్వాలని కోరారు.