రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
26-09-2026 | 06:25pm
ఖానాపూర్ ( విజయక్రాంతి): మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం(Government) మంజూరు చేసిన నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే వేడుమ బోజ్జి పటేల్ అందజేశారు.పెంబి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో రైతులు గోస్కుల శ్రీను,108000/-గోస్కుల తిరుమల,144000/-కోప్పుల జ్యోతి,144000/-ఎలిగేటి అనిల్ కుమార్,216000/-ఒడ్నాల ఉమ – 144000/- ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం చెక్కులను చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతులు, పేదలు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు. అనంతరం డిజిటల్ కార్డు అందించారు.