ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
తాడ్వాయి,సెప్టెంబర్,26( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని కృష్ణాజివాడి, తాడువాయి,ఏండ్రియాల, చిట్యాల, నందివాడ, ఎర్రపహాడ్,బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి,దేమికలాన్ గ్రామాల్లో జయంతి వేడుకలు(Birth Anniversary Celebrations) నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ... వీరనారి చాకలి ఐలమ్మ ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాటం(Armed Peasant Struggle)లో ఆమె చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఒక మహిళగా ఒంటరిగా నిలబడి భూస్వాములను, పెత్తందారులను గడగడలాడించిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చాకలి ఎస్సి సాధన సమితి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.