పోలంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహా కార్యక్రమం

26-09-2026 | 10:01pm

తిమ్మాపూర్, సెప్టెంబరు 26 (విజయక్రాంతి): తిమ్మాపూర్ మండలం(Thimmapur Mandal) పోలంపల్లి అంగన్వాడి కేంద్రంలో(Polampalli Anganwadi Centre) పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి(District Welfare Officer Saraswathi) హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం పోషణ మాసం సందర్భంగా ఈనెల 9 నుండి అక్టోబర్ 8 వరకు పోషణ కార్యక్రమాలు(Nutrition programs) జరుపుకుంటున్నామని అన్నారు. మన అంగన్వాడి మన బాధ్యత అనే భావనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

ప్రతి ఒక్కరు అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలని సరైన పోషణ తో సరైన ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. కేవలం పోషకాహారమే కాకుండా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, పోలంపల్లి సర్పంచ్ గుంటి లావణ్య మల్లేశం, నర్సింగాపూర్ సర్పంచ్ పెరుక రవీందర్, సిడిపిఓ శ్రీలత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కుమార్, అంగన్వాడి సూపర్వైజర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు