జైన మందిరంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

26-09-2026 | 09:51pm

హత్నూర: మండలంలోని నవాబుపేట గ్రామం(Nawabpet village)లోని పురాతన జైన మందిరంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భగవంతుని ఊరేగింపు, పల్లకీసేవ చేపట్టారు. జైన భక్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జైన భక్తులు, గ్రామ సర్పంచ్ బుచ్చయ్య, ఉపసర్పంచ్ బాబి, అన్వర్ హుస్సేన్‌తో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు