ఐదు దశాబ్దాల అనుబంధం

29-11-2026 | 05:54pm

నిర్మల్ నవంబర్ 29 ( విజయ క్రాంతి) : అర్ధ శతాబ్దం కాలం గడిచినా చెదరని స్నేహబంధాలు(Bonds of Friendship).. వయసు మీద పడినా మదిలో ఆప్యాయంగా పలకరించే గుణం. పదిలంగా ఉన్న బాల్య జ్ఞాపకాలు(Childhood Memories).. ఐదు దశాబ్దాల తర్వాత పాత మిత్రులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో నిర్మల్‌(Nirmal) లో సందడి నెలకొంది. 1974–1976 సంవత్సరాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్(Intermediate) చదువుకున్న పూర్వ విద్యార్థుల(Alumni) 50 ఏళ్ల స్వర్ణోత్సవ సమ్మేళనాన్ని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

నిర్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Nirmal Government Junior College) విద్యనభ్యసించి, అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 93 మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదు దశాబ్దాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ విద్యార్థి జీవితంలోని మధుర ఘట్టాలను గుర్తుచేసుకుంటూ, కుటుంబాలు, ఉద్యోగ, జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాటి బాల్య చిత్రాలు, ప్రస్తుత చిత్రాలతో 'నాడు - నేడు' పేరుతో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

మరిన్ని వార్తలు