డ్రోన్ దాడి మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
మృతుని తల్లి, భార్య వినతి
సహకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): దుబాయ్(Dubai)లోని రియాద్ లో డ్రోన్ దాడిలో(Drone Attack) మృతి చెందిన కామారెడ్డికి(Kamareddy) చెందిన షేక్ సహిద్(Sheikh Sahid) (40) కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని వృద్ధురాలైన తల్లి, భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ మృతిని భార్య, తల్లి ఆదివారం సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు.
సిఎం ప్రజావాణి ఇంచార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) కి విన్నవించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. బాయ్ ప్ర కుటుంబానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తా మని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.