ఇందిరమ్మ ఇంటితో పేదలకు గౌరవం

29-11-2026 | 06:05pm

రాజాపూర్ నవంబర్ 29: గూడు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ(Indiramma) నిర్మించడం ద్వారా పేదలకు ఆత్మగౌరవం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్(Congress Party Mandal President Shekhar Goud) అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో(Raghavapur Village) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రతిష్టాంకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ లక్ష్మి పథకంలో(Indiramma Gruha Lakshmi Scheme) భాగంగా నిర్మించిన పిట్టల శివలీల నూతన గృహన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలను విస్మరించి ఒక గృహం కూడా ఇవ్వలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి గ్రామంలో అర్హులైన పేదలను గుర్తించి ఇండ్ల నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ అనూష మల్లేష్,ఉప సర్పంచ్ యాదయ్య,వార్డు మెంబర్ లక్ష్మీ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు వెంకట్  నాయక్, నరసింహులు, మహేందర్ గౌడ్, నరసింహులు కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు