కెసిఆర్ దీక్షా దవాస్ తోనే తెలంగాణ సాధ్యం

29-11-2026 | 05:39pm
  1. మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి
  2. మేడ్చల్ లో దీక్షా దవాస్ కార్యక్రమం విజయవంతం

మేడ్చల్ అర్బన్ నవంబర్ 29(విజయక్రాంతి): కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) చేపట్టిన దీక్షా దవాస్ కార్యక్రమంతోనే(Diksha Divas Program) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి(Chamakura Mallareddy) పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్ మున్సిపల్(Medchal Municipal) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ముందు ఏర్పాటు చేసిన దీక్షా దవాస్ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులు కార్యకర్తలు మాజి ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజి మంత్రి వర్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.అంతేకాకుండా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షా దవాస్ కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన ఏకైక వ్యక్తి మాజి సిఎం కేసీఆర్ ఇక్కరేనని మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి కొనియాడారు.

రానున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తిరిగి బిఆర్ఎస్ పార్టీ మాజి సీఎం కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.నేటి నుంచి మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజి ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్.విషు చారి.సంజీవ రెడ్డి.ప్రవీణ్.ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ నాయక్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు