జైల్ భరోను జయప్రదం చేయండి: సిపిఐ

29-11-2026 | 05:44pm

ముకరంపుర, నవంబర్ 29(విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ(BJP government) ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్(Chief Election Commissioner of India, Gyanesh Kumar) ను తొలగించాలని డిసెంబర్ 1న సిపిఐ జైల్ భరో కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్(CPI District Secretary Panjala Srinivas) పిలుపునిచ్చారు.కేంద్రంలో నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మూడు పర్యాయాలు పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ,జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు డిసెంబర్ 1న  జైల్ భరో పేరుతో కలెక్టరేట్ ముట్టడికి  ముఖ్య అతిథిగా సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరవుతారు అనీ, కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని  శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు