గ్రామాల్లో సూది మందులు బంద్!?
- సమ్మె చేస్తున్న రెండో ఏఎన్ఎంలు
- పిల్లలకు నెలసరి టీకాలు అంతరాయం
- గర్భిణులకు తప్పని అవస్థలు
నిర్మల్ అక్టోబర్ 2౬ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో(Nirmal district) వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) రెండవ ఆరోగ్య కార్యకర్తలు సమ్మెబాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు(medical services) తీవ్ర అంతరాయం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రజా ఆరోగ్యాన్ని అందించి ఏఎన్ఎంలు గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 2007 నుంచి తాము ప్రభుత్వ ఉద్యోగులతో(government employees) సమానంగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత , వేతనాల పెంపు తదితర న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం జాప్యం చేయడంతో సమ్మె చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ(Department of Medical and Health) పరిధిలో అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జనాభా ప్రతిపదికన క్లస్టర్ గ్రామంలో ఏఎన్ఎం లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య భద్రత, ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 220 రెండవ ఆరోగ్య కార్యకర్తలు సమ్మె చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అసలే సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సీజనువ్యాధులు సరైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో అందక ప్రజలు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు.
వైద్య సేవలు తీవ్ర అంతరాయం
నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు సమ్మెబాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సేవలో అంతరాయం కలుగుతుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు సగం మంది కంటే ఎక్కువగా రెండో ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. వీరంతా ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఏఎన్ఎంలు వారి సబ్ సెంటర్ పరిధిలో ప్రజలకు ఆరోగ్య టీకాలు వేయడం, గర్భిణీలకు వైద్య సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, బీపీ షుగర్ ఇతర రోగాల నియంత్రణకు మందులు సరఫరా, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ, గ్రామాల్లో వైరల్ ఫీవర్ సర్వే, ఏఎన్ఎంలు నిర్వహిస్తారు.
ఈనెల 13 నుంచి సమ్మె చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీరు సేవలు ప్రజలకు అందడం లేదు. ముఖ్యంగా జ్వరం, గర్భిణీలు, చిన్నపిల్లలకు టీకాలు, దీర్ఘకాలిక సమస్యలు జబ్బులు ఉన్న రోగులకు మాత్రల పంపిణీ, తదితర సేవలు గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోతున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు వైద్య సేవల కోసం ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తే తాము సమ్మె చేస్తున్నామని, వైద్యం అందించలేమని చెప్పడంతో ప్రజలు ఆందోళనలతో పట్టణాలకు పరుగు తీసి ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరికొందరు ప్రభుత్వ వైద్యం చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు సమ్మెబాట పట్టడంతో ఈ ప్రభావం వైద్య ఆరోగ్య శాఖ పై కూడా చూపుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు ఆరోగ్య సంక్షేమ టీకాల్లో అంతరాయం కలగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందించే ఆరోగ్య కార్యకర్తలు సమ్మె చేయడం వల్ల జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో సూదులు మందులు కూలీలు ఇచ్చేవారు కరువైపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
నిర్మల్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ లో ఎదురు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు సమ్మె చేయడంతో ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్లు రెగ్యులర్ ఏఎన్ఎంలు సమన్వయం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు చిన్నపిల్లలకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు నెలసరి అందించే వైద్య సేవలను ఇబ్బంది కలగకుండా ఉన్న సిబ్బందితో సర్దుబాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నారు.
పనిచేస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో వారు ఒక ప్రాంతంలో వెళ్తే మరో ప్రాంతాల్లో సమస్యలు ఏమవుతుంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో వైద్య ఉద్యోగుల సమ్మె పరిష్కారం కోసం వారు కృషి చేస్తున్న జెఎసి డిమాండ్ల సాధన కోసం పట్టు పట్టడంతో ఈ సమస్య ఇప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి
2007 నుంచి కాంట్రాక్ట్ రెండవ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నా. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తాము విదులు నిర్వహిస్తున్న తమకు ఇప్పటివరకు ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ వేతనాలు కూడా సరిపోవడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్న తమ సేవలను ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
పులి శోభ, నిర్మల్
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
నిర్మల్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే రెండవ ఏఎన్ఎంలు 13 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను చేసి వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఎక్కువగా ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులు పనిచేయడం వల్ల కొంత ఇబ్బంది ఉన్న దాన్ని అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్య సేవలను అందిపుచ్చుకోవాలి.
డాక్టర్ రాజేందర్, జిల్లా వైద్యాధికారి