తోపుడు బళ్లు.. మృత్యుపాశాలు?

27-10-2026 | 05:10am

మంథనిలో ప్రధాన రహదారిపై పాదచారులు, వాహనదారులకు తప్పని ప్రమాదం

యువకుడి మృతితోనూ మేల్కొనని అధికారులు

పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖలు స్పందించేదెప్పుడు?

మంథని, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నా అధికారుల్లో చలనం లేదా... రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నా పట్టించుకునే వా రే లేరా... మంథని పట్టణ ప్రధాన రహదారిపై నెలకొన్న పరిస్థితులు ప్రజల్లో తీవ్ర ఆ ందోళన కలిగిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమిస్తూ పండ్ల దుకాణాలు(Fruit shops), మిర్చి బండ్లు, తోపుడు బండ్లు ఏర్పా టు చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో పా దచారులు, బైకర్స్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యువకుడి మృతి.. ప్రమాదకర పరిస్థితులకు అద్దం

మంథని పాత పెట్రోల్ బంక్(Manthani Old Petrol Pump) సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని మండలం మల్లేపల్లికి చెందిన యు వకుడు నవీన్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం పట్టణ ప్రజలను తీవ్ర ది గ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనతో ప్రధాన రహదారిపై భద్రతా చర్యల అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. రహదా రులపై రాకపోకలు సజావుగా సాగేందుకు, ప్రమాదాలను నివారించేందుకు అధికారు లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కోట్ల రూపాయలతో అభివృద్ధి.. అయినా తప్పని ఇబ్బందులు

మంథని పట్టణ అభివృద్ధిలో భాగంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) కోట్లాది రూపాయలతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే, రహదారుల అభివృద్ధితోపాటు వాటిపై ఆక్రమ ణల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతపై కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాన రహదారికి ఆనుకుని వ్యాపా రాలు నిర్వహించడం, వాహనాలు నిలపడం, పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి రావడం వంటి పరిస్థితులు ప్రమాదాలకు దారితీసే అవకాశ ముందని ఆందోళన వ్యక్తమవుతోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులకు ముందున్న రహదారి స్పష్టంగా కని పించకపోవడం, పాదచారులు రోడ్డు దాటే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం సమస్యను తీవ్రం చేస్తున్నాయి.

పట్టించుకునే అధికారులేరీ..?

ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు, ఫుట్పాత్ల ఆక్రమణలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నా సంబంధిత శాఖల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపి స్తున్నాయి. పోలీస్, రెవెన్యూ, రోడ్లుభవనాల శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి లో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాదకర కూడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

మంథని పాత పెట్రోల్ బంక్ సమీపం, అంబేద్కర్ చౌక్, బస్సు డిపో పరిసరాలు, బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైనచో ట ట్రాఫిక్ పోలీసులను నియమించడం, ర హదారి ఆక్రమణలను తొలగించడం, పాదచారులకు సురక్షిత మార్గాలు కల్పించడం, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయ డం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాల తీవ్రత, రహదారి పరిస్థి తులను పరిశీలించి సాంకేతిక ప్రమాణాలక నుగుణంగా అవసరమైన చోట వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఇప్పటికైనా మేల్కొంటారా?

ఒకవైపు పట్టణ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, మరోవైపు ప్రధాన రహ దారిపై భద్రతా సమస్యలు కొనసాగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రమా దం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టడమే అధికారుల బాధ్యత అని పట్టణవాసులు పేర్కొంటున్నారు. మరో ప్రాణం బలికాకముందే అధికారులు స్పందిస్తారా... ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితులకు అడ్డుకట్ట వేస్తారా... మంథని ప్రజలు ఎదురుచూస్తున్నారు..

మరిన్ని వార్తలు