భద్రతతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

12-11-2026 | 05:57pm
  1. యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి
  2. సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు

రామగిరి, నవంబర్ 12 (విజయక్రాంతి): సింగరేణిలో(Singareni) నిర్దేశించిన బొగ్గు, ఓవర్‌బర్డెన్(Overburden) (ఓబీ) ఉత్పత్తి లక్ష్యాలను కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సాధించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం సింగరేణి రామగుండం ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-1 ఉపరితల గనిని ఆయన సందర్శించి వ్యూ పాయింట్ నుంచి జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం జనరల్ మేనేజర్లతో పాటు అధికారులతో సమావేశమై బొగ్గు, ఓబీ ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, జీడీకే-10 గని పనుల పురోగతిపై సమీక్షించారు. ఓసీపీ-1, ఓసీపీ-2, ఓసీపీ-3 ఉపరితల గనులతో పాటు వకీల్‌పల్లి భూగర్భ గనిలో జరుగుతున్న విస్తరణ పనులు, యంత్రాల పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, భద్రతతో కూడిన ఉత్పత్తి సాధనకు అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎం.రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ ఎ.ఉదయ భాస్కర్, ప్రాజెక్టు అధికారులు ప్రవీణ్ వి.ఫ్యాటింగ్, జె.రాజశేఖర్, వకీల్‌పల్లి గని ఏజెంట్ నెహ్రూ, ప్రాజెక్టు ఇంజినీర్లు జ్ఞాన సంబంధం, ప్రకాష్, ఐఈడీ జీఎం బి.టి.మురళీకృష్ణ, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, ఎస్టేట్స్ అధికారి కె.ఐలయ్య, మేనేజర్ రావుల పాపయ్య, ఏరియా సెక్యూరిటీ అధికారి కోల శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు