మానేరు వాగులో దూకబోయిన వ్యక్తి
12-11-2026 | 06:18pm
కాపాడి మానవత్వం చాటుకున్న భరత్ గౌడ్
తంగళ్ళపల్లి, నవంబర్ 12 (విజయ క్రాంతి): సిరిసిల్ల మానేరు వాగులో(Manair Stream in Sircilla) ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన కొలనూర్ గ్రామానికి చెందిన పులి రామచంద్రాన్ని గుగ్గిళ్ల భరత్ గౌడ్ ధైర్యసాహసాలతో కాపాడారు.
కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడైన భరత్ గౌడ్ ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. ప్రాణాలకు తెగించి వాగులో దూకబోయిన రామచంద్రాన్ని రక్షించి ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన భరత్ గౌడ్‌ను స్థానికులు అభినందించారు. ఆయన సేవాభావం, మానవత్వాన్ని కొనియాడారు.