మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

15-10-2026 | 03:47pm

మూసాపేట్ /అక్టోబర్ 15: మూసాపేట మండలం పరిధిలోని అచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన బోయని హనుమంతు బుధవారం మృతి చెందారు.. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy)  గురువారం అచ్చయ్య పల్లి గ్రామంలో ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు