లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారి దర్శనం

15-10-2026 | 03:38pm

గణపురం, అక్టోబర్ 15 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి(Goddess Lalita Tripura Sundari) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పూజా కార్యక్రమాలను అర్చకులు వినయ్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు