అదిలాబాద్ జిల్లా సిపిఐ జిల్లా కన్వీనర్

15-10-2026 | 03:55pm

బోథ్. అక్టోబర్ 15 ( విజయక్రాంతి) ఆదిలాబాద్ జిల్లా సిపిఐ నూతన కన్వీనర్ గా ఎస్ విలాస్(S. Vilas as Convener) ను ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కన్వీనర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి లుతక్కలపల్లి శ్రీనివాస్ కలివేణి శంకరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం పెండింగ్ లో ఉన్న జిల్లా నిర్మాణ కమిటీని రద్దుచేస్తూ జిల్లా కార్యదర్శి మూడు ప్రభాకర్ రెడ్డిని తొలగించడం జరిగిందన్నారు. ఈనెల 25 26 27 తేదీల్లో రాష్ట్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలాల్లోని నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో ఓటు చోరీ జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ బిజెపి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్నారు. 14 కోట్ల ఓట్ల తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఐ ప్రధాన జాతీయ నాయకులు ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం దేశంలో ఎలోనిన్ ప్రభావం ఉందని, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.

ఒక్కో రైతుకు 50 వేల రూపాయలు ఇవ్వాలనిడిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఐ నాయకులు గోవర్ధన్, నరేష్ ,దాసు, మున్షిప్, భోజన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు