ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
దామరచర్ల :అక్టోబర్ :15: దామరచర్ల మండలం గణేష్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటూ నూతన గృహాల్లో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగు నాయక్, బంటు కిరణ్,స్కైలాబ్ నాయక్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.