ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి..

15-10-2026 | 03:53pm

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, అక్టోబర్ 15  ( విజయ క్రాంతి ): ఎల్ ని నో ప్రభావం చూపి విద్యుసర్ఫరలు అంతరాయం రాకుండా  తగిన చర్యలు తీసుకొని  నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా అయ్యే విధంగా  విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) కృషి చేయాలని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ డివిజన్ అధికారులు,

సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందేలా చూడాలని, గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కొత్త కనెక్షన్లు, మీటర్ల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని  విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు