దసరా గొడవ కేసులో పోలీసుల కఠిన చర్యలు

10-11-2026 | 08:25pm

నిందితుడి అరెస్ట్.. న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్

వీర్నపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వీర్నపల్లి మండలంలోని వన్‌పల్లి గ్రామంలో దసరా పండుగ(Dasara Festival) సందర్భంగా చోటుచేసుకున్న గొడవ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు(Case registration) చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడు దసరి పోచయ్య (తండ్రి నంపల్లి)ను అదుపులోకి తీసుకున్నారు.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

విచారణ అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గొడవలు, అల్లర్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు