ధూమపానం చేయనివారికీ సీఓపీడీ ముప్పు
* మహిళలు, టీబీ బాధితులపైనా ప్రభావం
* కామినేనిలో ఈ ఏడాది 3,193 కేసుల నమోదు
ఎల్బీనగర్ , నవంబర్ 18 : ఇళ్లలో వంట పొగ, బయోమాస్ ఇంధనాల కాలుష్యంతో(Pollution from cooking fumes and biomass fuels) ధూమపానం(Smoking) చేయని మహిళలు, గతంలో టీబీ(TB) బారినపడినవారిలోనూ సీఓపీడీ (ఊపిరితిత్తుల దీర్ఘకాలిక వ్యాధి)(Chronic lung disease) ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ సీఓపీడీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి(Kamineni Hospital) లో వైద్యులు ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 17 వరకు ఆసుపత్రిలో 1,967 ఇన్‌పేషెంట్, 1,226 ఔట్‌పేషెంట్ కేసులు కలిపి మొత్తం 3,193 నమోదయ్యాయి.
దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా స్పైరోమెట్రీ పరీక్షతో వ్యాధిని తొలిదశలోనే గుర్తించాలని సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభాకర్ కంది సూచించారు. స్పైరోమెట్రీ, డీఎల్సీఓ పరీక్షలతో పాటు ప్రత్యేక సీఓపీడీ క్లినిక్, ధూమపాన విరమణ క్లినిక్, పల్మనరీ రీహాబిలిటేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ధూమపాన విరమణ, టీకాలు, పోషకాహారం, నిరంతర వైద్య పర్యవేక్షణతో వ్యాధి తీవ్రతను నియంత్రించి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని డాక్టర్ రవీంద్రరెడ్డి పేర్కొన్నారు.