ఓటర్ల జాబితాపై వ్యాసరచన పోటీ

18-11-2026 | 09:39pm

పాపన్నపేట,నవంబర్18: స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అనే అంశంపై భారత ఎన్నికల సంఘం(Election Commission of India) నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండల పరిధిలోని యూసఫ్ పేట ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని నేహ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు పద్మ వెల్లడించారు. ఈ విద్యార్థికి హెచ్ఎం పద్మ గైడ్ టీచరుగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైన నేహను పాఠశాల తరఫున హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు