రోబోటిక్‌ కిడ్నీ సర్జరీల్లో.. 'సన్‌ ఇన్‌స్టిట్యూట్‌' మైలురాయి

18-11-2026 | 09:55pm

- మెరిల్‌ రోబోటిక్‌ వ్యవస్థతో 20 శస్త్రచికిత్సలు‌: డాక్టర్‌ వడ్డి సూర్యప్రకాశ్‌

ఎల్బీనగర్, నవంబర్ 18 : అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతికతతో(Cutting-edge robotic technology) సంక్లిష్ట కిడ్నీ శస్త్రచికిత్సలను(Kidney surgery) కచ్చితత్వంతో నిర్వహించే అవకాశం ఏర్పడిందని 'సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీ('Sun Institute of Urology') ' సీనియర్‌ యూరాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వడ్డి సూర్యప్రకాశ్‌(Dr. Vaddi Suryaprakash) తెలిపారు. ఎల్బీనగర్‌లోని సన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ  ఆసుపత్రిలో(Sun Institute of Urology Hospital) మెరిల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ వ్యవస్థ ద్వారా 20 కిడ్నీ రోబోటిక్‌ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బుధవారం ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 కిడ్నీ రోబోటిక్ సర్జరీ లను పూర్తి చేయడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు.

సంప్రదాయ ఓపెన్‌, ల్యాపరోస్కోపిక్‌ విధానాలతో పోలిస్తే రోబోటిక్‌ సర్జరీలో హైడెఫినిషన్‌ 3డీ దృశ్యాలు, కచ్చితమైన కదలికలతో కూడిన రోబోటిక్‌ చేతులు వైద్యులకు మెరుగైన నియంత్రణను అందిస్తాయని వివరించారు. కిడ్నీ కణుతుల తొలగింపు, పునర్నిర్మాణ శస్త్రచికిత్సల్లో ఆరోగ్యకరమైన కణజాలాన్ని కాపాడేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. రోబోటిక్‌ శస్త్రచికిత్సలో రక్తస్రావం, నొప్పి తక్కువగా ఉండటంతో రోగులు త్వరగా కోలుకుని ఒకటి నుంచి మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్‌ తెలిపారు. సుమారు 130 కిలోల బరువున్న హైరిస్క్‌ రోగులకు సైతం సంక్లిష్ట కిడ్నీ స్టోన్‌ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

రాడికల్‌ ప్రోస్టేటెక్టమీ, రాడికల్‌ సిస్టెక్టమీ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల్లోనూ 3డీ మాగ్నిఫైడ్‌ విజన్‌ ద్వారా నరాలు, రక్తనాళాలను గుర్తించి కాపాడేందుకు రోబోటిక్‌ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన వైద్యం అందించి రోగులు త్వరగా కోలుకునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎల్బీనగర్‌లో 50 పడకలతో పనిచేస్తున్న సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూరాలజీలో అధునాతన రోబోటిక్‌, మినిమల్లీ ఇన్వేసివ్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో అనస్తీషియా హెడ్ డా క్టర్ అనూష, డాక్టర్ దినేష్, డాక్టర్ శుభణీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు