నిరుపేదలకు ‘చేయూత' పింఛన్లు

18-11-2026 | 09:40pm

కేసముద్రం, (విజయక్రాంతి): నిరుపేదల ఆర్థిక అభివృద్ధికి(Economic development of the poor) చేయూత పింఛన్లు(Pensions) అండగా నిలుస్తాయని కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) 16వ వార్డు కౌన్సిలర్ వల్లందాస్ ఉమ రవి(Vallandas Uma Ravi) అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు ముందుకు సాగుతుందన్నారు. 16వ వార్డు పరిధిలో చేయూత పింఛన్ల పథకంలో మంజూరైన 22 మందికి పింఛన్ మంజూరు పత్రాలను మున్సిపల్ కమిషనర్ టీ.శ్రీనివాసరావు తో కలిసి అందజేశారు.

మరిన్ని వార్తలు