సేవా కార్యక్రమాల స్ఫూర్తి..
ఎండీఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, యువకులు
పటాన్చెరు, నవంబర్ 18: సేవా కార్యక్రమాలతో(Service activities) ప్రజలకు చేరువవుతున్న ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్(Chairman of the MDR Foundation) మాద్రి దేవేందర్ రాజు జన్మదిన వేడుకలను ఎండీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన సభ్యులు, అభిమానులు కేక్ కట్ చేసి దేవేందర్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న దేవేందర్ రాజు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా యువసేన ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజమే కుటుంబంగా భావించి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్న దేవేందర్ రాజు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. సేవా భావంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఎండీఆర్ యువసేన సభ్యులు, అభిమానులు, పలువురు యువకులు పాల్గొని జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరిపారు.