చెట్టు కూలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

18-11-2026 | 09:43pm

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

ఎల్బీనగర్ , నవంబర్ 18 : గ్యాస్ సిలిండర్ బుక్(Gas Cylinder Book) చేయడానికి బైక్(Bike) పై వెళ్తున్న వారిపై ఎండిపోయిన చెట్టు కూలడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software employee) అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్(Nagole Police Station) పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నాగోల్ డివిజన్ లోని సుమ వేంకటేశ్వర కాలనీ ఇందు అరణ్యంలో నివసిస్తున్న సాయికుమార్ (29) ఇతను ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు బైక్ పై  ఇందు ఆరణ్య నుంచి గౌరెల్లి వైపు వెళ్తున్నారు.

గుంటూరు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు అకస్మాత్తుగా బైక్ పై పై కూలిపడింది. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు