అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వాలి
మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 18 : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు(Pensions) ఇవ్వాలని గడ్డి అన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి(Baddam Prem Maheshwar Reddy) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు(Old age and disability pensions) అర్హులైన వారికి అందజేస్తామని ప్రకటించడంతో ఎంతోకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వికలాంగులు(Elderly and disabled) ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉండటంతో లబ్ధిదారులు(Beneficiaries) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సరూర్నగర్(Saroornagar) సర్కిల్ యూసీడీ సిబ్బంది సైదులుని కలిసి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ కోసం వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని, ముఖ్యంగా వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి పెన్షన్ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని యూసీడీ సిబ్బంది సైదులు హామీ ఇచ్చారు.