నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి

18-10-2026 | 05:25am
  1. పొదుపు పద్ధతులపై షార్ట్‌ఫిలింలు తీయండి
  2. యువ డైరెక్టర్లకు డిప్యూటీ సీఎం పిలుపు

అక్టోబర్ 17 (విజయక్రాంతి): భవిష్యత్తులో నీటి లభ్యత కీలక సమస్యగా మారే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)పేర్కొన్నారు. ఆహార ధాన్యాల లభ్యతతో పోలిస్తే తాగునీటి నిల్వలు, వాటి సంరక్షణపై అప్రమత్తత అవసరమని సూచించారు. వర్షభావ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి ఆవిరి పెరుగుదల వంటి అంశాలు భవిష్యత్తులో నీటి వనరులపై ఒత్తిడిని పెంచవచ్చని హెచ్చరించారు.

బతుకమ్మ యం గ్ ఫిలిం మేకర్ చాలెంజ్ అవార్డ్సు 2026 ప్రదానత్సోవంలో భట్టి మాట్లాడారు. మనుషులు, పశు వులు, పక్షుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా ఎలా కాపాడుకోవాలి, వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టాలి, ప్రకృతిని ఎలా పరిరక్షించాలి వంటి అంశాలను కథాంశాలుగా తీసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని యువ దర్శకులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించడంలో కళాకారులు, కథానా యకులు, ఫిలిం మేకర్లు కీలక పాత్ర పోషించగలరని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వాతావరణ మార్పుల ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించే కథాంశాలను కూడా యువ దర్శకులు ఎంచుకోవాలని సూచించారు.

ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడే సందేశాలను సృజనాత్మకంగా అందిస్తే షార్ట్ఫిల్మ్లు సామాజిక మార్పునకు దోహదపడతాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కళలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న నేపథ్యంలో కళారంగంలోని ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దర్శకులు, కళాకారులు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని 

 

మరిన్ని వార్తలు