హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- ఫలించిన సీఎం రేవంత్ కృషి
- రూ. 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్ల మేర విస్తరణ
- 50:50 జాయింట్ వెంచర్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
- నగరాభివృద్ధికి మరో మైలురాయి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): విశ్వనగరం హైదరాబాద్‌లో ప్రజా రవాణాను(Public transport) సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Enumula Revanth Reddy) చేసిన నిరంతర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. నగరాభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక రంగాలు(IT and industrial sectors) మరియు పాతబస్తీ అనుసంధానమే లక్ష్యంగా ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (ఫేజ్-2) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదముద్ర వేసింది.
ఢిల్లీ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని, ప్రధాని నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) పాటు కేంద్ర మంత్రులకు పలుమార్లు జరిపిన భేటీలు, రాసిన లేఖలతోనే ఈ బృహత్తర ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ. 24,269 కోట్లతో జాయింట్ వెంచర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(Joint Venture Comprehensive Project Report) (డీపీర్ )ను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ(Union Ministry of Urban Development), ఈ ప్రాజెక్టును 50:50 జాయింట్ వెంచర్ (జేవి) పద్ధతిలో చేపట్టేందుకు సమతి తెలిపింది.
మొత్తం నిర్మాణ వ్యయం : రూ. 24,269 కోట్లు
మొత్తం ప్రాజెక్ట్ నిడివి : 76.4 కిలోమీటర్లు
ప్రాజెక్ట్ ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరిగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేయడంతో త్వరితగతిన అనుమతులు లభించాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోద ముద్ర పడటంతో, ఎయిర్పోర్ట్ కారిడార్ మరియు పాతబస్తీ లైన్ల పనులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎమ్ఆర్ఎల్ అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టువదలకుండా చేసిన విజ్ఞప్తుల వల్లే ఈ బృహత్తర ప్రాజెక్టు సత్వరం ముందడుగు వేసిందని ప్రజాప్రతినిధులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదిత 5 ప్రధాన కారిడార్లు ఇవే..
1) నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ : 36.8 కి.మీ (అంతర్జాతీయ విమానాశ్రయం)
2) రాయదుర్గం-కోకాపేట నియోపోలిస్ : 11.6 కి.మీ (ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌ల అనుసంధానం)
3) ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట : 7.5 కి.మీ (పాతబస్తీ ప్రాంతంలో మెట్రో విస్తరణ)
4) మియాపూర్-పటాన్చెరు : 13.4 కి.మీ (పారిశ్రామిక రంగానికి ఊతం)
5) ఎల్బీ నగర్-హయత్‌నగర్ : 7.1 కి.మీ (విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నివారణ)