రాళ్లకత్వలో చెత్త, తాగునీటి కష్టాలు
- ట్రాక్టర్‌ను తొలగించి ఆటోతో చెత్త సేకరణ
- నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజల అవస్థలు సమస్యలు పరిష్కరించాలంటూ కమిషనర్‌కు వినతి
జిన్నారం: మున్సిపాలిటీగా(Jinnaram municipality ) మారినా తమ సమస్యలు మాత్రం తీరడం లేదని రాళ్లకత్వ 20వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెత్త సేకరణకు నెలవారీ రుసుము చెల్లించాల్సి వస్తుండగా, మరోవైపు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ యువకులు జిన్నారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ట్రాక్టర్ సేవలు పునరుద్ధరించాలి
గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌తో చెత్త సేకరణ జరిగేదని, మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత ట్రాక్టర్‌ను తొలగించి ఆటో ద్వారా చెత్త సేకరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇందుకోసం నెలకు రూ.50 వసూలు చేస్తుండటంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి
వార్డులో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. నీటి కోసం గ్రామంలోని ప్రజలు సరిగా రాక వాటర్ ప్రతి ఇంటికి సరిపోయినంత రావడంలేదని నీటితో చాలా ఇబ్బంది ఉందని ఆ ఇబ్బంది తట్టుకోలేక మోటార్లు పెట్టాల్సి వస్తుందని బాధ వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి నీటి సరఫరాలో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రజలకు నిరంతరం తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాళ్లకత్వ 20వ వార్డులో నెలకొన్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని గ్రామ యువకులు కోరారు. ఈ కార్యక్రమంలో సాయి గౌడ్, ఈరబోయిన గణేష్, శ్రీధర్, శ్రీశైలం, మహేష్, శ్రీకాంత్, రాయిని మహేష్, జింక రాజు పాల్గొన్నారు.