పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండ

22-11-2026 | 08:27pm

11 మందికి రూ. 4.90 లక్షల చెక్కుల పంపిణీ 

నల్లబెల్లి, నవంబరు 21 (విజయక్రాంతి): ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) కొండంత అండగా నిలుస్తోందని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైనాల వీరస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 11 మంది లబ్ధిదారులకు రూ.4.90 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మాజీ సర్పంచి నానబోయిన రాజారాంతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ బాటలో పయనిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ప్యాక్స్‌ డైరెక్టర్‌ బత్తిని మల్లయ్య, త్రికోపేల మురళి, పరికి త్యాగరాజు, కొత్తపెళ్లి రమణాచారి, గాజు బిక్షపతి, పాండవుల శంకర్‌లింగం, మామిడి వేణు, వేముల రాజు, కనకం మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు