క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

28-10-2026 | 09:19pm

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

పటాన్‌చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) క్రీడాకారులకు అండగా నిలుస్తూ, ఢిల్లీలో నవంబర్ 1 నుంచి 5 వరకు జరిగే 70వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్(70th National School Games) కుస్తీ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొనే అండర్-17 బాలబాలికల జట్లకు సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నామని, తెలంగాణ జట్టు జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జట్టు కోసం రూ.1.50 లక్షలతో స్పోర్ట్స్ కిట్లు, భోజన వసతి, ప్రయాణ ఖర్చులను అందించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు