రోడ్డుపై గుంతలను జేసీబీతో పూడ్చిన ఎస్ఐ మహేష్
* ప్రజా సేవలో ముందుడే ఎస్ఐ మహేష్ కు ప్రజల నుంచి ప్రశంసలు
సిర్గాపూర్ నవంబర్ 10 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం నుండి నల్లవాగు (సుల్తానాబాద్) కు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఎస్ఐ మహేష్(SI Mahesh) ప్రజా సమస్య పరిష్కారానికి ముందడుగు వేశారు. మంగళవారం నాడు జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చించే పనులు చేపట్టారు.
ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ మహేష్ స్వయంగా చొరవ తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న ఎస్ఐ మహేష్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయనతో పాటు పోలీస్ సిబ్బంది పీసీలు సీతారామ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రశాంత్ ఉన్నారు.