ఎర్రజెండా వైపు యువత అడుగులు

10-11-2026 | 08:35pm

* 10 కుటుంబాలు సీపీఎంలో చేరిక

* వివిధ పార్టీలకు రాజీనామా

* ప్రజా పోరాటాలే ఆకర్షణగా చేరిన యువకులు

మోతె, నవంబర్ 10 (విజయకాంతి):- మోతె మండల(Mothe Mandal) పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో(Mamillagudem Village) సీపీఎంకు(CPM) కొత్త బలం చేకూరింది. మండలంలో పార్టీ నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై చింతమల్ల రాజు నాయకత్వంలో 10 కుటుంబాలకు చెందిన యువకులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి సీపీఎంలో చేరారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు వారికి ఎర్రజెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కష్టజీవుల హక్కుల సాధన, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సీపీఎం పోరాడుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా ఆర్థిక అసమానతలు తొలగలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోతే మండలంలో పార్టీ బలోపేతం అవుతోందని, కొత్తగా చేరిన కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ నెల 15న నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.కార్యక్రమానికి సీపీఎం గ్రామ కార్యదర్శి షేక్ జహీనాభి అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు, మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, నాయకుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు