మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలి..

10-11-2026 | 08:25pm

మద్యం మత్తులో డ్రైవింగ్ వద్దు: ఎస్ఐ మహేష్ 

సిర్గాపూర్ నవంబర్ 10 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎస్ఐ మహేష్ సిబ్బందితో కలిసి మమ్మురంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మహేష్(SI Mahesh) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్ఐ మహేష్ ప్రజలకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి డ్రైవింగ్‌కు పాల్పడవద్దని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఎస్ఐ మహేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు