పోరుబాటలో బడి పంతుళ్లు!

29-09-2026 | 05:40am
  1. గాంధీ జయంతి సాక్షిగా నిరాహార దీక్షకు ఎస్జీటీయూ పిలుపు
  2. ఇక ఒత్తిడులు తట్టుకోలేమని స్పష్టం
  3. గుదిబండలా మారిన జీవో 25 
  4. రాష్ట్ర వ్యాప్తంగా 49వేల ఎస్టీటీల పోరుబాట
  5. చర్చనీయాంశంగా మారిన విజయక్రాంతి కథనం

(ఎ.చంద్రశేఖర్ రావు):

సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు(Secondary Grade Teachers), ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు(Primary school teachers) తీవ్రమైన డిజిటల్ వర్క్‌లోడ్(Digital workload), యాప్ల నిర్వహణ(App Management), జీవో 25 నిబంధనలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ పోరుబాటకు సిద్ధమవుతున్నా రు. పాఠా లు చెప్పడం పక్కనబెట్టి నిరంతరం వివిధ ప్రభుత్వ యాప్‌లలో(Government apps) డేటా ఎంట్రీలు చేయడం, సర్వర్ల మొరాయింపు, సిబ్బంది కొరతతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నా రు.

ఇటీవల జగిత్యాల జిల్లాకు చెందిన ఒక ఇన్‌చార్జి హెడ్మాస్టర్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం, రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోట్లతో పలువురు ఉపాధ్యాయులు మరణించా రనే వార్తలు ఈ నిరసనలకు మరింత ఆజ్యం పోశాయి. కాగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలపై విజయక్రాంతి దినపత్రిక ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో చలనం రేకెత్తించింది.

ప్రభుత్వం డిజిట లైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన మితిమీరిన యాప్ ల నిర్వహణ ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శాపంగా మారింది. బోధనను మరిచి కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారుతున్నామంటూ రాష్ట్రంలోని దాదాపు 49 వేల మంది ఎస్జీటీలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 

బోధనకు దూరమవుతున్న గురువులు

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు నిత్యం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లలో వివిధ యాప్‌లను అప్డేట్ చేయడానికే పరిమితమవుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల అటెండెన్స్ కోసం ప్రవేశపె ట్టిన ఈ యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ లేక గంట ల తరబడి సమయం వృథా అవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరిట ప్రతి విద్యార్థి ప్రగతిని నిరంతరం యాప్‌లో నమోదు చేయాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన వివరాలు, స్పర్ష్ ఫైనాన్షియల్ పోర్టల్ ఎంట్రీలు, యుడీఐఎస్‌ఈ డేటా నమోదు వంటి పనులతో ఉపాధ్యాయులు పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా రాత్రి వేళల్లో డేటా ఎంట్రీలు చేయాల్సి వస్తోంది. 

గుదిబండలా జీవో 25 

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం తెచ్చిన జీవో 25 ప్రాథమిక పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రా ష్ట్రంలో 60 శాతం పైగా ప్రాథమిక పాఠశాలలు కేవలం ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. 20 నుంచి 30 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకే టీచర్‌ను కేటాయించడం వ ల్ల ఆ ఉపాధ్యాయుడు ఒకేసారి 1వ తరగతి నుం చి 5వ తరగతుల పిల్లలకు బహుళ సబ్జెక్టులు బోధించాల్సి వస్తోంది. దీనికి తోడు యాప్‌ల రిపోర్టింగ్, విద్యాశాఖ అధికారుల తనిఖీలలో యాప్ అప్లోడ్లకే ప్రాధాన్యం ఇవ్వడం టీచర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

డేటా ఎంట్రీలు, రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదంటూ ఉన్నతాధికా రుల వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిలువకోడూరు పాఠశాల ఇన్‌చార్జి హెడ్మాస్టర్ ప్రశాంత్ స్కూల్ కాం ప్లెక్స్ సమావేశంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టి ంచింది. కాగా గత కొన్ని నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా దాదాపు 12 మంది ఉపాధ్యాయులు గుండెపోటుతో మరణించారని సెండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. 

గాంధీ జయంతి సాక్షిగా పోరుబాట

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెల ంగాణ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకటేశం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాబోయే గాంధీ జయంతి అక్టోబర్ 2 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపో తే మరిన్ని ఉద్యమాలకు  సిద్ధమవుతున్నట్లు చెపుతున్నారు.

ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీ సం ఇద్దరు ఎస్జీటీలను నియమించాలని, ఆన్లైన్ పనులు, యాప్ అప్లోడ్ల కోసం పాఠశాలలకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేదా డేటా ఎం ట్రీ ఆపరేటర్లను కేటాయించాలని, టీచర్లను కేవ లం బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చే స్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. 

ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యం

ప్రాథమిక విద్యను పాఠశాలలో బలోపే తం చేయడమే ప్రథమ కర్తవ్యం. పునాదిలాంటి ప్రాథమిక విద్యను విద్యార్థులకు దూ రం చేస్తున్న జీవో 25ను వెంటనే రద్దు చేయా లి లేదా సవరణ చేసి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి. అలాగే బోధనేతర పనులను వెంటనే విరమించి ఇందుకు సి బ్బందిని ఏర్పాటు చేయాలి. ఎస్జీటీ ఉపాధ్యాయులంతా అక్టోబర్ 2న చేపట్టబోయే నిరా హార దీక్షకు తరలిరావాలి.

 అరికెల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి, ఎస్జీటీయూ 

మరిన్ని వార్తలు